
నారాయణ్ ఖేడ్, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మచ్చేందర్ గురువారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలం నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుట్టే షాప్ వద్దకు వెళ్లి చెప్పులు కుడుతూ ప్రచారం చేశారు.
తనను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో కుల వృత్తులకు లబ్ధి చేసే చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.