
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సుప్రీం అని, రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని మంగళవారం (ఏప్రిల్ 22) ఢిల్లీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నారు.
రాష్ట్రాల బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టే అధికారం లేదని.. అదే విధంగా రాష్ట్రపతికి కూడా బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీం ఇచ్చిన సంచలన తీర్పుపై జగదీప్ ధన్కర్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. మరోసారి ఇవాళ పార్లమెంటే ఈ దేశంలో అత్యున్నతమైనదని వ్యాఖ్యలు చేయడం మరింత వివాదాస్పదంగా మారింది.
దేశంలో పార్లమెంటును మించిన అత్యున్నత వ్యవస్థ ఏదైనా ఉందా అనే ఆలోచన కూడా అవసరం లేదని, పార్లమెంటే అత్యున్నతమైనదని అన్నారు. రాజ్యాంగ సంబంధిత అంశాలలో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం తీసుకునే అధికారులుగా ఉండాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా పార్లమెంట్ కంటే గొప్పదేది ఉందని పేర్కొనలేదు. పార్లమెంటే అత్యున్నతమైనదని అన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం ప్రజాప్రతినిధులకే ఉంటుందని ఈ సందర్భంగా ధన్కర్ అన్నారు.
►ALSO READ | రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే ఆ వీడియో తొలగించాలని ఆదేశాలు