పార్లమెంట్​ నియమావళి.. ప్రత్యేక కథనం

పార్లమెంట్​ నియమావళి.. ప్రత్యేక కథనం

భారతదేశ పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటిని పార్లమెంట్​ రూపొందిస్తుంది. సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి అవసరమైన శాసనాలన్నింటిని  రూపొందిస్తుంది.  పాత శాసనాల్లోని లోపాలను సవరించి నూతన అంశాలను పొందుపరుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్​లో వివిధ ప్రక్రియలను అనుసరిస్తారు . వివిధ పదజాలాలను వాడుతుంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

క్రాసింగ్ ​ది ఫ్లోర్​

పార్లమెంట్​లో లేదా శాసనసభలో ప్రసంగించే సభ్యుడి, సభాపతికి మధ్యలో అంటే అడ్డుగా ఏ సభ్యుడైనా ఉన్నట్లయితే దానిని క్రాసింగ్​ ది ఫ్లోర్​గా పేర్కొంటారు. ఈ విధంగా వ్యవహరించడం సభా నియమ నిబంధనలకు విరుద్ధంగా భావిస్తారు. 

నో డే ​ఎట్ నేమ్​డ్ మోషన్

పార్లమెంట్​ సభ్యుడు లేదా శాసనసభ్యుడు ఏదైనా ఒక అంశంపై సభాపతికి తీర్మాన నోటీసు ఇచ్చినప్పుడు సభాధిపతి సభ్యుడి నోటీసును అంగీకరించినప్పటికీ దానిపై చర్చకు తేదీని, సమయాన్ని నిర్ణయించనప్పుడు దానినే నో డే ఎట్​ నేమ్ డ్​ మోషన్​గా పేర్కొంటారు.

 స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు

 ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై 10 రోజుల లోపు ముందస్తు నోటీసు సభాపతికి ఇచ్చినప్పుడు సభాపతి నిర్ణయించిన తేదీకి సమాధానాలు చెబుతారు. దీనికి మౌఖిక సమాధానం చెబుతారు. 

ఎజెండా

సభలో చర్చించడానికి ముందుగానే నిర్ణయించే కార్యక్రమాల పట్టికే ఎజెండా. ఏ రోజు ఏ మంత్రి ఏ బిల్లు ప్రవేశ పెడతారో, ఏ సవరణలు, ఏ ప్రతిపాదనలు ఉన్నాయో ప్రధాన పక్ష నేతలకు ఎవరికి అడిగే అవకాశం ఇస్తారో ముందుగానే నిర్ణయించేది. దానికి అనుగుణంగా సభా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. 

అన్​ అటాచ్​డ్​

పార్లమెంట్​ లేదా శాసనసభలో రాజకీయ పార్టీలు ఏ సభ్యుడినైనా తమ పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు ఆ సభ్యులను సభాపతులు అన్ ​అటాచ్​డ్​ సభ్యులుగా ప్రకటించి వారికి స్థానాలు కేటాయిస్తారు. ఈ సందర్భంలో స్వతంత్ర అభ్యర్థులను కూడా అన్​ అటాచ్​డ్​గా పేర్కొనడం గమనార్హం.

జీరో అవర్

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా కార్యక్రమాల ముందు సమయమే జీరో అవర్. భారత పార్లమెంట్​ సృష్టించిన ముఖ్య సంప్రదాయంగా దీన్ని పేర్కొనవచ్చు. 1962లో ప్రవేశపెట్టినప్పటికీ, 1964 నుంచి జీరో అవర్ ​ముఖ్య సంప్రదాయంగా కొనసాగుతున్నది. జీరో అవర్​కు నిర్దిష్ట సమయం ఉండదు. ముందస్తు నోటీసు లేకుండా ప్రశ్నలు అడగవచ్చు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు దీన్ని పాటిస్తారని పేర్కొన్నా ఇటీవల పార్లమెంట్​ సమావేశాలు ముందుగా ప్రారంభమవుతున్నాయి. అందువల్ల సభాపతి విచక్షణను అనుసరించి దీన్ని పాటిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దీనిని సభాపతి రద్దు చేసే అవకాశం ఉన్నది. 

వాయిదా తీర్మానం

ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఏదైనా అంశంపై చర్చించడానికి ఎజెండాలోని కార్యక్రమాలను వాయిదా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం. వాయిదా తీర్మాన నోటీసుపై కనీసం 10 మంది సభ్యులు సంతకాలు చేయాలి. దీనిని అనుమతించడం సభాపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
 
పాయింట్​ ఆఫ్​ ఆర్డర్

సభలోని కార్యక్రమాలు సభా నియమ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే సందర్భంలో సభలో చర్చ పక్కతోవ పట్టినప్పుడు సభ్యులు పాయింట్ ఆఫ్​ ఆర్డర్ ను లేవనెత్తవచ్చు. కనీసం ఇద్దరు సభ్యులు దీనిని సమర్థించాలి. దీనిని అనుమతించడం సభాపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. 

అడ్జోర్న్​

పార్లమెంట్​ లేదా శాసనసభ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయడాన్నే అడ్జోర్న్​ అంటారు. సభాపతులు ఆయా సభలను తాత్కాలిక వాయిదా వేస్తారు. సభాపతి సభను వాయిదా వేసినప్పుడు  తిరిగి సమావేశాలు ఏ తేదీ, ఏ సమయంలో జరుగుతాయనేది ముందుగానే తెలుపుతూ సభను వాయిదా వేస్తారు. 

సైనిడై

జరుగుతున్న సమావేశాలను తర్వాత తేదీని లేక సమయాన్ని ప్రకటించకుండా అర్ధాంతరంగా వాయిదా వేయడమే సైనిడై. లోక్​సభ లేదా విధానసభ స్పీకర్లు సైనిడై చేస్తారు. 

ప్రోరోగ్​

పార్లమెంట్ లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి పార్లమెంట్​ను, గవర్నర్​ శాసనసభను దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని ప్రోరోగ్​ అంటారు. 

గిలెటోన్

పార్లమెంట్ లేక శాసనసభ సమావేశాల ముగింపు దశలో వివిధ బిల్లులపై సమగ్ర చర్చ జరపడానికి తగిన సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించడానికి గిలెటోన్ అంటారు. 

క్లోజర్​ మోషన్​

పార్లమెంట్​లో ఏదైనా అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చర్చను అర్ధాంతరంగా 
నిలిపివేసి బిల్లుపై సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్ జరగాలని కోరడాన్నే క్లోజర్ మోషన్​ అంటారు.

అభిశంసన తీర్మానం

ప్రభుత్వంలోని ఒక మంత్రిపై గానీ కొందరు మంత్రులపై గానీ లేక మొత్తం ప్రభుత్వంపై గానీ అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. సభా హక్కులను ఉల్లంఘించినప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు ఆయా మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ఈ తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి తప్పనిసరిగా కారణం చూపాలి. 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

అవిశ్వాస తీర్మానం

ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టే తీర్మానం. ఒక మంత్రిపై గానీ కొందరు మంత్రులపై గానీ దీన్ని ప్రవేశపెట్టరాదు. మొత్తం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ప్రత్యేక కారణాలు చూపాల్సిన అవసరం లేదు. దీన్ని లోక్​సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. కనీసం 50 మంది సభ్యులు తీర్మాన నోటీసుపై సంతకాలు చేయాలి. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య కనీస కాల వ్యవధి ఆరు నెలలు. 

విశ్వాస తీర్మానం

లోక్​సభలో విశ్వాసాన్ని (మెజార్టీ) కాపాడుకున్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లోక్ సభలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో రాష్ట్రపతి నియమించే ప్రధాని, మంత్రి మండలి నిర్ణీత గడువులోగా విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. ఈ తీర్మానం వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. 

సావధాన తీర్మానం

ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై చర్చించాలనే ఉద్దేశంతో సభ దృష్టిని ఆకర్షించడానికి ఈ తీర్మానం ప్రవేశపెడతారు. దీనిని అనుమతించడం సభాపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. జీరో అవర్​ తర్వాత ఎజెండా కంటే ముందు సావధాన తీర్మానానికి అవకాశమిస్తారు. 

ప్రశ్నోత్తరాల సమయం

పార్లమెంట్​ లేదా శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు మొదటి గంటలను ప్రశ్నోత్తరాల సమయంగా పాటిస్తారు. 10 రోజులు ముందుగా సభాపతికి నోటీసులు ఇవ్వాలి. ప్రశ్నలు ప్రధానంగా రెండు రకాలు. 1. నక్షత్ర మార్కు గల ప్రశ్నలు. 2. నక్షత్ర మార్కు లేని ప్రశ్నలు.

నక్షత్ర మార్కు గల ప్రశ్నలు

ఈ ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు అవకాశం ఉంటుంది.
నక్షత్ర మార్కు లేని ప్రశ్నలు

 ఈ ప్రశ్నలకు మంత్రులు రాతపూర్వకంగా సమాధానమిస్తారు. అనుబంధ ప్రశ్నలకు అవకాశం ఉండదు. ప్రశ్నలు నక్షత్ర మార్కు కలిగినవి, నక్షత్ర మార్కు లేనివి అనేది సభాపతి నిర్ణయిస్తారు. 

అర్ధగంట చర్చ

పార్లమెంట్​ సమావేశాలు ముగింపు దశలో అంటే ఆ రోజు సమావేశాన్ని ముగించడానికి చివరి అర గంటను అర్ధగంట చర్చకు కేటాయిస్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యత లభించని అంశాలపై చర్చించడానికి దీనిని ఉపయోగిస్తారు. సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే అనుమతిస్తారు. అర్ధగంట చర్చలో చర్చించే అంశంపై మూడు రోజుల ముందుగా నోటీసులివ్వాలి. 