నవంబర్ 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నవంబర్  25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగుతాయి. 18వ లోక్ సభ ఏర్పడిన తర్వాత ఇది మొదటి వింటర్ సెషన్. ఈ సెషన్ లోనే ‘వన్  నేషన్  వన్  ఎలక్షన్, వక్ఫ్ బిల్లు’ వంటివి ప్రవేశపెట్టనున్నారు. 

అలాగే, జమ్మూకాశ్మీర్​కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను ఆమోదించే తీర్మానాన్ని కూడా పాస్  చేయనున్నారు. వర్షాకాల మొదటి సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగాయి. ఆ సెషన్​లో మొత్తం 15 మీటింగులు జరిగాయి. మొత్తం 115 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  యూనియన్  బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.