అవార్డు వాపస్ ఇవ్వబోమని హామీ ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: విశేషమైన ప్రతిభతో అవార్డులు పొందినవారు రాజకీయ కారణాలతో వాటిని వెనక్కి ఇచ్చేస్తుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభల్లో సోమవారం ప్రవేశపెట్టింది.

ALSO READ :ఇన్​కం టాక్స్ రిటర్న్స్​ దాఖలు గడువు పెంచండి

జాతీయ అకాడమీలు, ఇతర సాంస్కృతిక సంస్థలు ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తామని వస్తున్న ప్రకటనలపై చర్చించింది. ఇకపై ఏదైనా అవార్డు ఇచ్చేముందు..దాన్ని నిరసన రూపంలో వాపస్ ఇవ్వబోమని గ్రహిత నుంచి తప్పనిసరిగా హామీ తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.