నెయ్యిలో పరోటా.. స్వర్గానికి దారట..!

నెయ్యిలో పరోటా..  స్వర్గానికి దారట..!

సోషల్​ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు తమకు నచ్చిన సమాచారాన్ని వెతికి తెలుసుకుంటున్నారు. అందులో ఫ్యాషన్​, టెక్నాలజీ, సినిమా, క్రీడలు ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఫుడీ లు మాత్రం వంటల వీడియోలను భలేగా ఇష్టపడతారు.  ఆ వంటకాల్లో పరోటాకు ప్రత్యేకమైన ఫ్యాన్​ బేస్​ ఉంది. అయితే ఓ చోట చేస్తున్న పరోటా నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది.


స్విమ్మింగ్​ ఇన్​ ఘీ..


సాధారణంగా పరోటాలను తక్కువ నెయ్యితో తయారు చేస్తారు. ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​ అవుతున్న వీడియోలో ప్యాకెట్​ నెయ్యిని ఒకే పరోటా తయారీకి ఉపయోగించాడు ఓ వ్యక్తి. అతను పరోటాను నెయ్యిలో స్విమింగ్​ చేయించాడని, అది తింటే స్వర్గానికి తీసుకెళ్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అమ్మకందారుడు నెయ్యిని అమ్ముతున్నాడని, పరోటా అక్కడ సైడ్​ డిష్​లాగా ఉందని మరి కొందరు చమత్కరించారు. ఈ వీడియో 2.3 మిలియన్​లకు పైగా వీక్షణలు పొందింది.