ఐరోపాలో చిలుక జ్వరం అనే వింత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మరణించారు. జంతువులనుంచి మానవులకు సోకే వ్యాధి ఇది.పెంపుడు జంతువుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. దీంతో పెంపుడు జంతువులను పెంచే వారిలో ఆందోళన మొదలైంది.ఈ వ్యాధిని చిలుక జ్వరం అంటారట.. ప్రాణాంతకమైన ఈ వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.
చిలుక జ్వరం.. దీనిని పిట్టకోసిస్ లేదా క్లామిడియా పిట్టాసి ఇన్ ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. చిలుక జ్వరం అనేది క్లామిడియా సిట్టాసి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్. ఇది ప్రధానంగా చిలుకలు, కాకాటియల్, పావులరాలతో సహా పక్షులను సోకుతుంది.. వీటి ద్వారా మనుషులకు కూడా వ్యాప్తిస్తుంది. బాక్టీరియా వ్యాధి సోకిన పక్షుల రెట్టలు , వాటిని వచ్చే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన ధూలళి కణాలను నేరుగా పీల్చడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
మనుషుల్లో చిలుక జ్వరం
ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసనట వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఇది తీవ్రతరం అయితే న్యుమోనియా , ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.
చిలుక జ్వరం చికిత్స
చిలుక జ్వరాన్ని ముందుగా గుర్తిస్తే.. యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేయొచ్చు. ఈ వ్యాధి చికిత్సకు అత్యంత సాధారణ యాంటీ బయోటిక్స్ లో డాక్సీ సైక్లిన్ , ఎరిత్రోమైసిన్ లను ఉపయోగించొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. న్యుమోనియా అభివృద్ధి చెందిన సందర్భాల్లో ఇంట్రావీనస్ యాంటీ బయోటిక్స్ వాడతారు.