ఉమ్మడి మెదక్​జిల్లాలో పలు రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు

ఉమ్మడి మెదక్​జిల్లాలో పలు రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు

వెలుగు, నెట్​వర్క్:​ ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అమ్మవారు పలు రూపాల్లో దర్శనమిచ్చారు. ఏడపాయలలో వనదుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి సరస్వతి ఆలయంలో అమ్మ వారిని గౌరీ దేవిగా లక్ష గాజులతో అలంకరించారు. బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో దుర్గాదేవికి 21 రకాల నైవేద్యాలతో నివేదన చేశారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్, ఎంఐజీ కాలనీ, కానుకుంట ప్రాంతాల్లో బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు వెన్నవరం ఆదర్శ్​రెడ్డి పలు దేవి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆదర్శ్​రెడ్డితో పాటు కార్పొరేటర్​ పుష్ప, అంజయ్య, మోహన్​ గౌడ్​, ఆయా కాలనీల ప్రెసిడెంట్లు, లోకల్​ లీడర్లు పాల్గొన్నారు.