క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్

ముంబై ఇండియన్స్‌‌ టాలెంట్‌‌ స్కౌట్‌‌గా ఎంపిక

ముంబై: ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన వికెట్‌‌ కీపర్‌‌ పార్థివ్‌‌ పటేల్‌‌.. ముంబై ఇండియన్స్‌‌ ఫ్రాంచైజీతో కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు పార్థివ్‌‌ను తమ టాలెంట్‌‌ స్కౌట్‌‌గా నియమించుకున్నట్లు ముంబై ఫ్రాంచైజీ వెల్లడించింది. దీంతో గ్రాస్‌‌ రూట్‌‌ లెవెల్‌‌లో ప్లేయర్లను వెతికి పట్టుకుని వాళ్లను  నాణ్యమైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడం పార్థివ్‌‌ పని. ‘పార్థివ్‌‌కు డొమెస్టిక్‌‌, ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో చాలా ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఉంది. దాదాపు 18 ఏళ్ల పాటు వివిధ స్థాయిలో క్రికెట్‌‌ ఆడాడు. అందుకే ఐపీఎల్‌‌ కాంపిటీషన్‌‌ ఎలా ఉంటుందో అతను అర్థం చేసుకోగలడు. మా అవసరాలకు తగిన క్రికెటర్లను అతను ఎంపిక చేస్తాడని ఆశిస్తున్నాం’ అని ముంబై ఇండియన్స్‌‌ పేర్కొంది. పార్థివ్‌‌.. ముంబై ఫ్రాంచైజీతో కలిసి పని చేయడంపై ఓనర్‌‌ ఆకాశ్‌‌ అంబానీ సంతోషం వ్యక్తం చేశాడు. అతని ఎంపిక తమ ఫ్రాంచైజీ ఫ్యూచర్‌‌కు బాగా దోహదపడుతుందన్నాడు. కాగా, అహ్మదాబాద్​లో ఇండోర్​ అకాడమీ ఓపెనింగ్​ సెర్మనీకి హాజరైన పార్థివ్​ ను బీసీసీఐ సెక్రటరీ జై షా సన్మానించారు.