IPL 2025: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ వికెట్ కీపర్

IPL 2025: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ వికెట్ కీపర్

గుజరాత్ టైటాన్స్ తమ కొత్త అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్ ను ప్రకటించింది. 2025 సీజన్‌కు బ్యాటింగ్ కోచ్ గా భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌ను నియమించింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బుధవారం (నవంబర్ 13) ఒక పత్రిక ద్వారా తమ కోచింగ్ స్టాఫ్‌లో పార్ధీవ్ పటేల్ ను చేర్చుకున్నట్టు అధికారికంగా ధృవీకరించింది. గ్యారీ కిర్‌స్టన్  స్థానంలో పార్థివ్ బౌలింగ్ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తాడు. విక్రమ్ సోలంకీ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. 

పార్థివ్ పటేల్‌ 2020లోనే అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరపున ఈ వికెట్ కీపర్ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లాడాడు. ఐపీఎల్ లో పార్థివ్.. 2008 నుంచి 2019 వరకు ఆరు వేర్వేరు ఫ్రాంచైజీల  తరపున ఆడాడు. మొత్తం 139 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 13 అర్ధ సెంచరీలతో 2848 పరుగులు చేశాడు. ఈ లీగ్ లో వికెట్ కీపర్‌గా 69 క్యాచ్‌లు,16 స్టంపింగ్‌లు కూడా చేశాడు.

ALSO READ | ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చింది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అంతర్జాతీ సూపర్ స్టార్ టీ20 స్పెషలిస్ట్ రషీద్ ఖాన్ ను తొలి రిటైన్ ప్లేయర్ గా రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. కెప్టెన్ శుభమాన్ గిల్ కు రూ. 16.50 దక్కాయి. సాయి సుదర్శన్ రూ. 8.50 కోట్లు.. రాహుల్ తెవాటియాకు రూ. 4 కోట్లు, షారుక్ ఖాన్ కు రూ 4 కోట్లతో గుజరాత్ జట్టులో కొనసాగనున్నారు.