టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన గిల్ కోలుకున్నాడని.. అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ చేశాడు. దీంతో గిల్ ఎవరి ప్లేస్ లో ఆడతాడని దానిపై డిబేట్ జరుగుతుంది. గిల్ స్థానంలో తొలి టెస్టులో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ బెంగళూరు టెస్టులో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు భారత టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారీ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ సర్ఫరాజ్ ను న్యూజిలాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ నుంచి తప్పించండి అంటూ భారత మాజీ వికెట్ కీపర్ పార్టీవ్ పటేల్ అన్నాడు.
రెండో టెస్ట్ నుంచి సర్ఫరాజ్ తప్పుకోవడం ఖాయమని, జట్టు మేనేజ్‌మెంట్ రాహుల్‌కు మద్దతుగా ఉంటుందని పార్టీవ్ పటేల్ తెలిపాడు.“కేఎల్ రాహుల్ బెంచ్‌కు పరిమితమవుతాడని నేను భావించడం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికీ అతనికి విలువనిస్తుంది. అందుకే అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చలేదు. అతను విరాట్ కోహ్లీకి బదులుగా నెం.3 స్లాట్‌లో సులభంగా బ్యాటింగ్ చేయగలడు. కానీ అది జరగలేదు. పూణె టెస్టులో గిల్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడంతో సర్ఫరాజ్ ను జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది". అని పార్థివ్ పటేల్ జియో సినిమాతో అన్నాడు.
Also Read :- బరువు తగ్గుతలే.. బాడీలో 30 శాతం కొవ్వు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో రాహుల్ పేలవ ఫామ్ తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లు అందరూ బాధ్యతగా ఆడితే రాహుల్ మాత్రం సీనియర్ బ్యాటర్ అయి ఉండి జట్టును కష్టాల్లో నెట్టాడు. దీంతో ముంబైలో జరగబోయే సెకండ్ టెస్టుకు అతడిపై వేటు ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రాహుల్ టెస్ట్ సగటు కేవలం 33.98 మాత్రమే ఉండడం అతనికి మైనస్ గా మారింది.
Parthiv Patel backs KL Rahul for the second Test despite Sarfaraz Khan’s heroics in Bengaluru. pic.twitter.com/9FqKjVVfcc
— CricTracker (@Cricketracker) October 22, 2024