ఇల్లెందు/కామేపల్లి, వెలుగు: మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీసును గురువారం వారు ప్రారంభించారు. అనంతరం ముచ్చర్లలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
వచ్చే నెల1న ఇల్లెందులో జరగనున్న కేసీఆర్సభను సక్సెస్చేయాలని కోరారు. ఎంపీపీ సునీత, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఇల్లెందులో నిర్వహించనున్న బీఆర్ఎస్ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరిశీలించారు. బొజ్జాయిగూడెం, లలితపురం గ్రామాల్లోని స్థలాలను పరిశీలించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.