ప్రజాపాలనలో ఎమ్మెల్యేల భాగస్వామ్యం

నెట్​వర్క్, వెలుగు: అభయ హస్తం హామీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో ఆయా చోట్ల ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. నిజామాబాద్ సిటీలోని పలు డివిజన్​లలో అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ  పర్యటించారు. రూరల్​మండలం ఖానాపూర్, మాధవ్​నగర్​ గ్రామాలో జరిగిన ప్రోగ్రామ్​లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని కార్యక్రమ లక్ష్యాలను ప్రజలకు వివరించారు.

ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని దరఖాస్తులు అందించాలని సూచించారు. జుక్కల్​ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు అచ్చంపేటలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్​రావు పాలుపంచుకున్నారు. ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి బోధన్ ​టౌన్​లో ని ఎల్ బీఎస్​నగర్, ఎడపల్లి మండలంలోని బాపూనగర్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.