గువాహటి: అసోంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సుమారు లక్షమంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు వరదనీరు కజిరంగా నేషనల్ పార్కు (కేఎన్పీ)లోకి ప్రవేశించింది. ప్రపంచ వారసత్వ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా పార్కు ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కజిరంగా జాతీయ పార్కులోని 68 ఫారెస్ట్క్యాంపులు నీటమునిగాయి. కేఎన్పీలోకి ప్రవేశించిన వరదనీటి వల్ల ఇంతవరకూ జంతువులు చనిపోలేదని, రెండు జింకలను రక్షించి చికిత్స కోసం పునరావాస కేంద్రానికి తరలించినట్లు ఫారెస్టు అధికారి తెలిపారు. కాగా, వరదనీటిలో మొత్తం 98,840మంది చిక్కుకున్నారని అసోం రాష్ర్ట డిజాస్టర్ మేనేజ్మెంట్ అథార్టీ (ఏఎస్డీఎంఏ) సోమవారం వెల్లడించింది. 13జిల్లాల్లోని 371గ్రామాలపై వరద ప్రభావం పడిందని ఏఎస్డీఎంఏ ప్రకటించింది. అయితే వరదల కారణంగా కొత్తగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అసోంలోని పలుప్రాంతాల్లో బ్రహ్మపుత్ర, దిఖౌ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దిఖౌ నది శివసాగర్ వద్ద, బ్రహ్మపుత్ర నది దుబ్రీ, తేజ్‌పూర్, నేమాటీఘాట్ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కజిరంగా నేషనల్ పార్క్‌లోకి వరద
- దేశం
- July 18, 2023
లేటెస్ట్
- అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు డాక్టరేట్ ఇవ్వొచ్చు : హరీశ్‌రావు
- కుందన్‌బాగ్‌లో కేక్ మిక్సింగ్
- 10 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత : ఎమ్మెల్సీ కవిత
- గద్వాల జిల్లాలో పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్
- హైవే ప్రమాదాల నివారణపై ఫోకస్
- మహా ఇల్లాలు: భర్త ఉరేస్కుంటుంటే.. వీడియో తీసింది
- అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్
- పర్యావరణ ప్యాకేజీ300 బిలియన్ డాలర్లేనా: కాప్ 29 నిర్ణయంపై భారత్ అసంతృప్తి
- పల్లె పనులకు యాక్షన్ ప్లాన్..ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి షురూ
- మళ్లీ అంధకారంలోకి రాష్ట్రం...సమైక్య పాలనలోలాంటి పరిస్థితులే కనిపిస్తున్నయ్: కేటీఆర్
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?