మంథనిలో బీజేపీతోనే మార్పు : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని, వెలుగు :  మంథనిలో రాజకీయ మార్పు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ వేశారు. అంతకుముందు పట్టణంలోని భిక్షేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ గొప్ప చరిత్ర, ఎన్నో వనరులు కలిగిన మంథని అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి,  అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రావు, లీడర్లు సత్య ప్రకాశ్, క్రాంతికుమార్, రమేశ్, రాజేందర్, నిరంజన్, సంపత్, అజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.