పార్టీ మార్పు దుమారం.. గద్వాల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పార్టీ మార్పు దుమారం.. గద్వాల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి  జూపల్లి కృష్ణారావు

గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి  ఇంటికి  వెళ్లారు.  ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి  కృష్ణారావు మాట్లాడారు. 

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నాడని తెలిపారు. పాత పరిచయాలతో అసెంబ్లీ కారిడార్ లో బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు తప్ప కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ మారే ఆలోచన లేదన్నారు.  బిఆర్ఎస్ లో  కృష్ణమోహన్ రెడ్డికి  చేరిక కేవలం ఊహాగానాలే అన్నారు. కాగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందని.. అందుకే పరామర్శించడానికి వచ్చానన్నారు.