
న్యూఢిల్లీ, వెలుగు: ‘చార్ సౌ పార్’ అంటూ ప్రచారం చేసినా... ఆశించిన ఫలితాలు రాకపోవడంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమావేశం నిర్వహించారు. బీజేపీకి ప్రధానంగా గండికొట్టిన రాష్ట్రాలు, అందుకు గల కారణాలు, పలు చోట్ల పార్టీ ఎక్కువ సీట్లు సాధించకపోవడంపై అభిప్రాయాలు కోరారు. యూపీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఆశించిన దానికన్న తక్కువ సీట్లు రావడంపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన నడ్డా.. తెలంగాణలో మరో 2 సీట్లు వస్తాయని ఆశించామన్నారు. ఆ రెండు సీట్లు ఎందుకు రాలేదనే అంశంపై ఫోకస్ చేయాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.