నాయకన్ గూడెంలో కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ ప్రారంభం

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండలంలో నాయకన్ గూడెంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ ఆఫీస్​ను పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియాంక గాంధీ రోడ్ షో జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం, పాలేరు మీదుగానే మొదలవుతుందని ప్రకటించారు.

పాలేరులో పొంగులేటి శీనన్న భారీ మెజారిటీ, ఇతర చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలను కాంక్షిస్తూ ఈ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వార్డు సభ్యులు లిక్కి వెంకటమ్మ, నరసయ్య దంపతులతోపాటు కాంచని గురవయ్య, ఎండ్లపల్లి ఉపేందర్, రావుట్ల సాయి, కాంతయ్య, శంకర్  కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.