అమిత్ షా సభను సక్సెస్​ చేయాలి : రావు పద్మ

హనుమకొండ, వెలుగు: ఈ నెల 12న హైదరాబాద్​ ఎల్​బీ గ్రౌండ్‌లో జరగనున్న బీజేపీ బూత్​ సంకల్ప్​ సమ్మేళనానికి  కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చీఫ్​ గెస్ట్‌ గా హాజరుకానున్నారని, ఈ సభను పార్టీ నేతలు, కార్యకర్తలంతా సక్సెస్ చేయాలని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. 60వ డివిజన్ కార్పొరేటర్  దాస్యం అభినవ్ భాస్కర్  ఆధ్వర్యంలో ఆదివారం వడేపల్లిలోని నిర్వహించిన  సన్నాహక సమావేశానికి రావు పద్మ చీఫ్​ గెస్ట్​ గా హాజరై మాట్లాడారు.  

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరగనున్న ఈ  సభలో కేంద్ర హోం మంత్రి  అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని,  ప్రజలు, కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.  కార్పొరేటర్  దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో  వివిధ పార్టీలకు చెందిన నేతలు, మహిళలు బీజేపీలో చేరగా..  రావు పద్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్ రెడ్డి, 52వ డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ,  నాయకులు పులి సర్రోతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.