- ఇల్లెందు బరిలో రవీందర్‌నాయక్
- ఫస్ట్ లిస్ట్‌లో టికెట్లు కన్ఫామ్చేసిన బీజేపీ హైకమాండ్
భద్రాచలం/ఇల్లెందు, వెలుగు: భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల బీజేపీ క్యాండేట్లను ఆ పార్టీ హైకమాండ్ఆదివారం ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా, ఫస్ట్ లిస్ట్‌లో ఇద్దరిని కన్ఫామ్చేసింది. భద్రాచలం టికెట్‌ను కుంజా ధర్మారావుకు కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. 2009 ఎన్నికల్లో ఆమె భద్రాచలం నుంచి గెలిచి నియోజకవర్గానికి సేవలందించారు. ఆమె స్థానంలో భర్త ధర్మారావుకు పార్టీ టికెట్‌ఇచ్చింది.
ఇంటర్‌వరకు చదువుకున్న ధర్మారావు ప్రస్తుతం బీజేపీ స్టేట్‌కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. 1980 నుంచి 2009 వరకు సీపీఎంలో ఉన్న ధర్మారావు 2001 నుంచి 2005 వరకు దుమ్ముగూడెం జడ్పీటీసీగా కొనసాగారు. 2009లో భార్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2010–-12 వరకు వైఎస్ఆర్కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో బీజేపీలో చేరి పార్టీ కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో కుంజా ధర్మారావుకు మంచి పట్టు ఉంది.
త్రిముఖ పోరు తప్పదా?
వరంగల్ మాజీ ఎంపీ, సీనియర్‌నేత రవీందర్ నాయక్‌ను బీజేపీ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. రవీందర్ సొంతూరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామం. హైదరాబాద్ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తిచేసిన ఆయన 1978లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థిగా పోటీచేశారు. సమీప సీపీఐ అభ్యర్థి కేతావత్ హరియాపై 15,674 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో 3,160 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.
1998లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) వరంగల్అభ్యర్థిగా పోటీచేశారు. టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లుపై గెలిచి ఎంపీ అయ్యారు. తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రవీందర్ నాయక్ లంబాడీలు, ఎరుకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషిచేసి బంజారా గాంధీగా పేరు పొందారు. రవీందర్‌నాయక్ ను ఇల్లెందు బరిలో దింపడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరలేపినట్లయింది. బీఆర్ఎస్నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ పోటీచేస్తుండగా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.