ములకలపల్లి/మణుగూరు/జులూరుపాడు, వెలుగు : కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ములకలపల్లి, మణుగూరు, జూలూరుపాడుతోపాటు ఆయా ప్రాంతాల్లో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎదుర్కోలేక కుట్ర పూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.