భువనగిరిలో బీజేపీని గెలిపించాలి : సత్యకుమార్

యాదాద్రి, వెలుగు:మోదీని మరోసారి ప్రధానిగా చూడాలంటే భువనగిరి పార్లమెంట్‌‌ స్థానంలో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధిపొందారని పేర్కొన్నారు.  కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకు వచ్చారని స్పష్టం చేశారు. 

వందల ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని రామ మందిరం, ఆర్టికల్​ 370 రద్దు, ట్రిపుల్​ తలాక్​ లాంటి సమస్యలు పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.  మోదీ అధికారం చేపట్టిన తర్వాతే ప్రపంచ దేశాలు భారత్​ వైపునకు చూస్తున్నాయని చెప్పారు.  మీటింగ్​లో బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, పార్లమెంట్ ప్రభారి పానుగంటి పాపారావు, బందారపు లింగస్వామి, పాశం బాస్కర్, వర్షిత్ రెడ్డి, బొక్క నరసింహ రెడ్డి, మాయ దశరథ, రత్నపురం బలరాం, జనగామ నర్సింహాచారి ఉన్నారు.