మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 229 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి( కాంగ్రెస్ కూటమి) 54 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది మహాయుతి కూటమి. అయితే మహారాష్ట్రలో మొత్తం ఇప్పటి వరకు లెక్కింపు అయిన ఓట్లను బట్టి ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం నమోదయిందో చూద్దాం
- బీజేపీ : 26 శాతం
- షిండే శివసేన వర్గం SHS : (12.59శాతం)
- కాంగ్రెస్: 11.33 శాతం
- SHSUBT(శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం : 10.46 శాతం
- NCP: 9.93 శాతం
- BSP: 0.45 శాతం
- NCPSP:(శరద్ పవార్ వర్గం): 11.33 శాతం
- ఇతరులు: 10.46 శాతం
- నోటాకు : 0.75 శాతం
- AIMIM : 0.87 శాతం
- ఎంఎన్ఎస్: 1.59