Paruvu: ప్రేమికులే హంతకులు అయితే.. ఉత్కంఠ రేపుతున్న పరువు ట్రైలర్

Paruvu: ప్రేమికులే హంతకులు అయితే.. ఉత్కంఠ రేపుతున్న పరువు ట్రైలర్

ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటుపడ్డారు. మరీ ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అదే కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి మరో ప్రాజెక్టు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది. అదే పరువు వెబ్ సిరీస్.

నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ను సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇంటెన్సీవ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మెగా బ్రదర్ నాగ బాబు కీ రోల్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సిరీస్ జూన్ 14న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ నుండి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. 

పెద్దలకు తెలియకుండా ఇంట్లోనుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట, ఆ జంటను వెంటాడే పెద్దలు, ఆ ప్రయాణంలో ఆ ప్రేమ జంటకు ఎదురైనా పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. అయితే తప్పించుకునే ప్రయత్నంలో ప్రేమికులే హంతకులు గా మారడం అనేది ఇక్కడ ఉత్కంటనే రేకెత్తించింది. దాంతో ఈ సిరీస్ పై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి జూన్ 14న రానున్న ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అనేది చూడాలి.