వైభవంగా పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం 

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం 

చండూరు (గట్టుపల) వెలుగు: గట్టుప్పల్ మండల కేంద్రంలో   భక్త మార్కండేశ్వర స్వామి  47వ, వార్షిక బ్రహ్మోత్సవాలు  ఘనంగా జరిగాయి.   బుధవారం పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం వైభవంగా జరిగింది.   రథోత్సవం ముందు కేరళ, భద్రాచలం నుంచి  వచ్చిన కళాకారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పరిసర గ్రామాల ప్రజలు బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కర్ణాటీ వెంకటేశం, మాజీ ఎంపీపీ ఆలయ కమిటీ చైర్మన్ అవ్వారి గీత శ్రీనివాస్, ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్, మాజీ సర్పంచ్ ఇడం రోజా  పాల్గొన్నారు.