న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ బిగ్ షాక్ ఇచ్చారు. కేజ్రీవాల్ కంచుకోట న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన పర్వేష్ వర్మ.. సొంత ఇలాకాలోనే ఆప్ అధినేతను మట్టికరిపించారు. 3 వేల ఓట్లకు పైగా తేడా కేజ్రీవాల్‌పై పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌పై అద్భుత విజయం తర్వాత పర్వేష్ వర్మ తొలిసారి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బీజేపీ ఐకానిక్ నినాదం ‘జై శ్రీ రాం’ అంటూ పోస్ట్ పెట్టారు.
అనంతరం పర్వేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో ఏర్పడబోయే ఈ ప్రభుత్వం ప్రధాని మోదీ దార్శనికతను ఇక్కడికి తీసుకువస్తుంది. ఈ విజయానికి ప్రధాని మోడిదే క్రెడిట్. బీజేపీకి అద్భుత విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇది ప్రధాని మోడీ, ఢిల్లీ ప్రజల విజయం’’ అని పేర్కొన్నారు. ఇక, 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆప్ వరుస విజయాలకు బ్రేకులు వేసిన కాషాయ పార్టీ.. హస్తినా పీఠం దక్కించుకుంది.
ALSO READ | నరాలు తెగే ఉత్కంఠ పోరులో సీఎం అతిశీ ఘన విజయం
ఢిల్లీలో బీజేపీ విజయం ఘన విజయం సాధించడంతో.. నెక్ట్స్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం అభ్యర్థిగా పర్వేష్ పేరు దాదాపు ఖాయమైనట్లేనని బీజేపీ వర్గా్ల్లో ప్రచారం జరుగుతోంది. న్యూఢిల్లీ సెగ్మెంట్లో విజయం సాధించిన వెంటనే పర్వేష్ వర్మ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. మరీ ఢిల్లీ సీఎం పగ్గాలను బీజేపీ ఎవరికీ అప్పగిస్తుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.