రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు.. సబ్సిడీపై ఆవులు, గేదెలు కొనుగోలు

రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు.. సబ్సిడీపై ఆవులు, గేదెలు కొనుగోలు

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని సాకారం చేసేందుకు, అన్నదాతల ఆదాయం పెంచడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ తీసుకువచ్చింది. దేశం మొత్తంలో కేవలం ఒక్క రాష్ట్రమే ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. అదే మధ్యప్రదేశ్​ ప్రభుత్వం.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పశుపోషణ చేయడానికి రైతులకు గుడ్​ న్యూస్​చెప్పింది. గేదెలు, ఆవులు కొనుగోలు చేసేందుకు  సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పశుపోషణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేదిశగా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని కోసం  మధ్యప్రదేశ్​  ప్రభుత్వం  పశు కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు సులభంగానే రుణం పొందొచ్చు. 

కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ నిబంధనలే పశు కిసాన్ క్రెడిట్ కార్డుకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద రైతులు ఎలాంటి గ్యారంటీ లేకుండా లక్షా 60 వేల రూపాయిల వరకు  రుణం పొందొచ్చు. రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండ ఆవులు, గేదెలు వంటి వాటి ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది.

బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అర్హత కలిగిన వారికి కచ్చితంగా రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. పశువుల కొనుగోలు, వాటి మెయింటెనెన్స్ వంటి వాటికి గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు.పశు కిసాన్ క్రెడిట్ కార్డుపై పశువులను కొనుగోలు చేస్తే  3 శాతం సబ్సిడీ పై రూ.15 వేలు అందజేస్తారు. అదే సమయంలో, గేదెలకు ఈ సంఖ్య రూ.18 వేలుగా ఉంటుంది. ఒక ఆవు కొనుగోలుకు రూ.40 వేల వరకు, గేదె కొనుగోలుకు రూ.60 వేల వరకు  రుణాన్ని అందిస్తారు.. పశు క్రెడిట్ కార్డు కావాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంకుకు . నెల రోజుల్లో కార్డు లబ్దిదారుల ఇంటికి వస్తుంది.

పశు కిసాన్​ క్రెడిట్​ కార్డుకు రైతులు స్థానిక పశువైద్య కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.  లేదంటే దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి వెళ్లి అప్లై చేసుకోవచ్చు .పశు కిసాన్​ క్రెడిట్​ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు  రైతులు  ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు  అవసరమవుతాయి.  దరఖాస్తు చేసుకున్న వెంటనే, పథకం యొక్క ప్రయోజనాలతో పాటు రుణ మొత్తం ఒక నెలలోపు మీ ఖాతాలో జమ చేయబడుతుంది.  ఇలాంటి స్కీమ్ మన రాష్ట్రంలోనూ అమలులోకి వస్తే బాగుంటుంది కదా...