కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని అసెంబ్లీలో తీర్మానం చేయండి

  • డిప్యూటీ సీఎం భట్టికి జేరిపోతుల పరుశురామ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం పరశురామ్ మాట్లాడుతూ.. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు ‘రూపాయే సమస్యకు పరిష్కార మార్గం’ అని ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర పుస్తకాన్ని రాసి హిల్టన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వ డం వల్లే ఆర్బీఐ ఏర్పడిందని గుర్తుచేశారు. ఆర్బీఐ ఏర్పడి 90 ఏండ్లు గడుస్తున్నా.. దేశ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించకపోవడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెం చేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని భట్టిని కోరానని చెప్పారు. తమ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.