
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సులో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో(RTC bus) ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. . వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి ఓదేలు (55) కరీంనగర్ లోని ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు శుక్రవారం ( మార్చి7) తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లేందుకు జమ్మికుంట నుంచి కరీంనగర్ కు వెళ్లే బస్సు ఎక్కాడు.
బస్సు కరీంనగర్ చేరుకోవడంతోనే ప్రయాణికులు అందరూ దిగారు. కాని ఓదేలు అనే వ్యక్తి ఒక్కడే సీటులో కూర్చొన్నాడు. ఎంతసేపటికి అతను బస్సు దిగేందుకు రాకపోవడంతో కండక్టర్ అతని దగ్గరకు వెళ్లి పలకరించాడు. ఎంత సేపటికి ఓదెలులో స్పందర లేకపోవడంతో అనుమానం వచ్చి కరీంనగర్ డిపోలోని ఆర్టీసీ కంట్రోలర్ కు సమాచారం ఇచ్చాడు.
ఆర్టీసీ అధికారులు 108 కి సమాచారం ఇవ్వడంతో.. వారు ఓదేలును పరిశీలించి హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్టు తెలిపారు. ఆ తరువాత కరీంనగర్ ఆర్టీసీ డిపో సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్ కు చేరుకున్న పోలీసులు ఓదేలు మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.