బంగారం అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు అడ్డాగా మారుతున్నాయి. విచ్చలవిడిగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు. అడ్డదారుల్లో బంగారాన్ని రవాణా చేస్తూ అడ్డంగా దొరుకుతున్నారు. లేటెస్ట్ గా అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడిని కొచ్చి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈలోని షార్జా నుంచి ప్రయాణిస్తున్న సకీర్ అనే ప్రయాణికుడిని తనిఖీ చేయగా లోదుస్తులో పేస్ట్ రూపంలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం 500 గ్రాములకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులకు సమాచారం రావడంతో అతడిని గ్రీన్ ఛానల్ దగ్గర అడ్డుకున్నారు. అతడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ALSO READ : బంగారం దొంగలు దొరికారు.. 18 కేజీలు రికవరీ
బుధవారం రాత్రి జరిగిన మరో సంఘటనలో గల్ఫ్ దేశం నుండి ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణీకురాలి నుంచి ఒక కిలో బరువున్న నాలుగు ట్యాబ్లెట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ తనిఖీల నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళను జిల్లా చీఫ్ స్క్వాడ్ పోలీసు అధికారులు విచారించారు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.