విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించి.. చిక్కుల్లో పడ్డాడు ఓ ప్రయాణికుడు. గురువారం ( డిసెంబర్ 5, 2024 ) బెంగళూరు నుంచి హైదరాబాద్ కి బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సహనం కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. ఇటీవల మాలి నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ ను లైంగికంగా వేధించిన ఘటన మరువక ముందే.. ఇవాళ మరో ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు నుండి హైదరాబాద్ కి బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించటంతో .. విసుగు చెందిన ఎయిర్ హోస్టెస్ విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ALSO READ : 50 మొక్కలు నాటాల్సిందే: కోర్టు ధిక్కారణకు పాల్పడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు శిక్ష
ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి నరసింహులుగా గుర్తించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు.