అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్ ను ఢీకొట్టింది. విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
PSA ఎయిర్ లైన్స్ కు చెందిన 5342 విమానం విచిత కన్సాస్ (ICT) నుండి వాషింగ్టన్ రీగన్ జాతీయ ఎయిర్ పోర్ట్ ((DCA) కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను విమానం ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో 2009 తర్వాత ప్యాసెంజర్ ప్లేన్ ఘటనలు జరగలేదని, ఇది ఘోర ప్రమాదమని అమెరికా ఏవియేషన్ అధికారులు అంటున్నారు.
#WATCH | US: A commercial airliner collided with a military helicopter while heading towards Ronald Reagan National Airport. The Ronald Reagan National Airport said that all takeoffs and landings have been halted at the airport. Federal Aviation Administration (FAA) and National… pic.twitter.com/0bn2xVC7pP
— ANI (@ANI) January 30, 2025