మాస్కో: కజకిస్తాన్లో ప్రయాణికులతో వెళుతున్న విమానం కుప్పకూలింది. అజర్ బైజన్ రాజధాని బాకు నుంచి రష్యాకు వెళుతున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 67 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 61 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ల్యాండింగ్ సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పొగ మంచు కారణంగా విమానం ప్రమాదానికి గురైంది. అజెర్ బైజన్ ఎయిర్ లైన్స్ విమానంగా అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
బాకు నుంచి రష్యాలోని గ్రోజ్ని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సేఫ్ అని అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు యత్నించిన క్రమంలో విమానం ల్యాండ్ అవుతుండగా మంటలు రేగాయి. ఈ మంటల్లో విమానం ముక్కలైపోయి తగలబడిపోయింది.
గ్రోజ్నీలో పొగమంచు అలుముకోవడంతో ఈ విమానాన్ని దారి మళ్లించక తప్పలేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్ వేపై దూసుకెళ్తూ విమానం అదుపు తప్పింది. ఒక్కసారిగా మంటలు రేగాయి. మంటల్లో విమానం చిక్కుకుపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైరింజన్లు రన్ వే వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రాణ నష్టం భారీగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Plane crash in Kazakhstan, 105 members on the plane including crew!pic.twitter.com/mzmX7Mfrrq
— Akashdeep Thind Team (@Akashdeepthind_) December 25, 2024