మా ఇష్టం : విమానంలో రొమాన్స్.. 4 గంటల సినిమా చూపించారు..

బైక్ పై రొమాన్స్ చూసుంటాం.. కారులో చిలిపి పనులు వినుంటాం.. పార్కుల్లో శృంగారం చూసుంటారం.. విమానంలో చూశామా.. పబ్లిక్ గా సీట్లపై పడుకుని రొమాన్స్ చేయటం చూశామా.. ఇప్పుడు చూస్తున్నది ప్రపంచం.. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

అమెరికాలో.. ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళుతుందో తెలియదుకానీ.. ఎక్స్ లో పోస్ట్ అయిన ఫొటోలు మాత్రం ఇంట్రస్టింగ్ మారాయి. విమానం ఎక్కిన ఓ జంట.. తన పక్కన రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో.. ఆ సీట్లపై పడుకుని రొమాన్స్ చేసుకున్నారు. నాలుగు గంటలు అలాగే గుసగుసలు ఆడుకున్నారు. ఒకరికి ఒకరు హగ్ చేసుకుని.. రొమాన్స్ సినిమా చూపించారు. వీళ్ల చిలిపి చేష్టలను మిగతా ప్రయాణికులు పట్టించుకోలేదా అంటే.. ఎవరూ ప్రశ్నించలేదు.. నోరెత్తలేదు. వాళ్ల రొమాన్స్ వాళ్ల ఇష్టం అన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

వీళ్లు ఇలా విమానంలోని మిగతా ప్రయాణికుల మధ్యనే పడుకుని రొమాన్స్ చేస్తుంటే.. విమాన సిబ్బంది ప్రశ్నించలేదా అంటే అబ్బే అది కూడా చేయలేదంట వాళ్లు.. సీట్లు ఖాళీగా ఉన్నాయి.. ఎవరినీ డిస్ట్రబ్ చేయటం లేదు.. అంతేనా మిగతా ఎవరూ క్వశ్చన్ చేయనప్పుడు విమాన సిబ్బందికి ఏం పని అన్నట్లు.. వాళ్లు కూడా అటూ ఇటూ తిరుగుతూ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారంట..

విమానంలోని ఓ ప్రయాణికుడు ఎక్స్ లో ఈ ఫొటోలు పోస్ట్ చేయటంతో వెలుగులోకి వచ్చాయి. విమానంలో రొమాన్స్.. అది కూడా పడుకుని హగ్ చేసుకుని 4 గంటలు ఫ్రీ రొమాన్స్ సినిమా చూపించారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.. పోనీలే మనకు లేని అదృష్టం మరొకరికి దొరికినప్పుడు ఏడవటం ఎందుకూ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు సుద్దపూసలు అయితే.. విమానంలో ఏంటీ దరిద్రపు పనులు అంటూ తిడుతున్నారు. అందరూ ఫొటోలు చూసి తిడుతున్నారు కానీ.. ఆ విమానంలో ఎవరూ మాట్లాడలేదు కదా.. క్వశ్చన్ చేయలేదు కదా..