రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరి అనుభవాలు సంతోషంతో నిండి ఉంటాయి. మరికొందరు వింత అనుభవాలను ఎదుర్కొంటారు. అలాంటి అనుభవమే ఓ ప్రయాణికుడికి ఎదురైంది. రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తికి రైల్వే సిబ్బంది షాకిచ్చారు. ఫుడ్ బిల్లును భారీగా వేసి వామ్మో అనిపించారు. ఈ విషయాన్ని బాధితుడు ట్విట్టర్లో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేమైందటే..
ఓ వ్యక్తి రైల్లో ప్రయాణించాడు. అయితే అతను రైల్లో వెజ్ మీల్, మత్తర్ పనీర్ ఆర్డర్ చేశాడు. దీనికి రైల్వే సిబ్బంది రూ. 1025 బిల్ వేశారు. దీనికి అదనంగా రూ. 660 జీఎస్టీని కలిపి..మొత్తంగా రూ. 1620లు చెల్లించాలని చెప్పారు. ఈ బిల్లుతో ప్రయాణికుడు షాక్కు గురయ్యాడు.
ఈ బిల్ ఏంటీ..అసలు..
రూ. 660 బిల్లుతో షాక్ గురైన బాధితుడు..ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఐఆర్సీడీసీలో ఏం జరుగుతోంది..ఆహారంపై 66 శాతం CGST,IGST వేయడమేంటి అని ప్రశ్నించాడు. తన పీఎన్ఆర్ నెంబర్ తో ఇండియన్ రైల్వేను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. బాధితుడి పోస్ట్కు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. బాధితుడి ఫోన్ నెంబర్ను తమకు పంపాలని కోరింది.
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. 660 జీఎస్టీ వేడయంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులు స్పందించాలని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి అయితే..మీకు బిల్లు వచ్చింది..మీకు హ్యాట్సాఫ్, నేను అడిగిన తర్వాత కూడా నాకు బిల్ ఇవ్వలేదని కామెంట్ చేశాడు.