టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో బస్సు ఆపలేదని ఓ ప్రయాణికుడు డ్రవర్ ని చెప్పుతో కొట్టాడు. నర్సంపేట నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నిన్న (జనవరి 10) ఈ ఘటన జరిగింది. కోరుట్ల పట్టణంలో తాను ఆపమన్న దగ్గర బస్సును ఆపలేదని సత్తార్ అనే ప్రయాణికుడు డ్రవర్ ని చెప్పుతో కొట్టాడు.
దీంతో బస్సు డ్రవర్ మోహన్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.