అది డెల్టావిమానం.. దాదాపు 30 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఒక్కసారిగా విమానం క్యాబిన్ మొత్తం దుర్వాసన అలముకుంది. ఇంతకీ ఏమైందా ఎయిర్ హోస్టెస్ అటు ఇటూ తిరుగుతూ వాసన ఎక్కడి నుంచి వస్తోందని పసిగట్టేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేశారు. ఓ ప్రయాణికుడు సీటులో మల విసర్జన చేశాడు.. దీంతో విమానం క్యాబిన్ అంతా దుర్వాసన వ్యాపించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
అయితే ఆ ప్రయాణికుడు డయేరియాతో బాధపడుతున్నాడని.. అనారోగ్యంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని చివరికి తెలుసుకున్నారు.ఈ సంఘటన 2023 డిసెంబర్ లో బర్మింగ్ హామ్ నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ లో జరిగింది. డయేరియాతో బాధపడుతున్న ప్రయాణికుడు ప్యాంటులోనే కానిచ్చేశాడు. దీంతో సీటు కూడా అంటుకోవడంతో దుర్వాసన వ్యాపించింది. దీనికి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. తదుపరి ప్రయాణానికి ముందు విమానాన్ని శుభ్రం చేశారా లేదా అని రాశారు. కొందరు నెటిజన్లు ప్రయాణికుడు అనారోగ్యంపై సానుభూతి చూపిస్తూ పోస్ట్ చేశారు. ఈ విషయంపై విమాన యాన సంస్థ స్పందించలేదు.. వ్యాఖ్యానించలేదు.