విమానంలో యువకుడు వీరంగం

విమానంలో యువకుడు వీరంగం
  • టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో విమానం టేక్​ ఆఫ్ ​అయ్యే టైంలో ఓ ప్యాసింజర్ గందరగోళం సృష్టించాడు. ఎమర్జెన్సీ డోర్ ​తెరిచేందుకు ప్రయత్నించాడు. ఎయిర్​లైన్స్​అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం శంషాబాద్​ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం(6ఈ6719)ను బిహార్​కు చెందిన యువకుడు(26) ఎక్కాడు. 

సరిగ్గా టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఫ్లైట్ సిబ్బంది ఎయిర్​లైన్స్​ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్​పోర్టు సెక్యూరిటీ గార్డులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది. ఆ తర్వాత విమానం వారణాసి బయలుదేరింది.