
న్యూఢిల్లీ:కిందటి నెలలో 3,99,386 ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, వ్యాన్లు, ట్రక్కులు వంటివి) అమ్ముడయ్యాయి. 2024 జనవరిలో జరిగిన 3,93,074 బండ్ల హోల్‌సేల్స్‌తో పోలిస్తే 1.6 శాతం గ్రోత్ నమోదయ్యింది. ప్యాసింజర్ వెహికల్ హోల్‌సేల్స్‌లో 2,12,995 యుటిలిటీ వెహికల్స్ ఉండగా, 1,27,065 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరిగాయి.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరిలో 11,250 వ్యాన్లను కంపెనీలు డీలర్‌షిప్‌లకు పంపాయి. ‘కిందటి నెలలో రికార్డ్ లెవెల్లో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 1.6 శాతం పెరిగి 3.99 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు.
బడ్జెట్‌లో ప్రకటించిన ట్యాక్స్ రాయితీలు, ఆర్‌బీఐ రేట్ల కోతతో వినియోగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకీ కిందటి నెలలో 1,73,599 బండ్లను అమ్మగా, హ్యుందాయ్ మోటార్స్ 54,003 బండ్లను, మహీంద్రా అండ్ మహీంద్రా 50,659 కార్లను విక్రయించాయి.
మరోవైపు 15,26,218 టూవీలర్లు జనవరిలో అమ్ముడయ్యాయి. ఇందులో 5,48,201 స్కూటర్లు, 9,36,145 మోటార్ సైకిళ్లు, 41,872 మోపెడ్స్ ఉన్నాయి. త్రీలర్ల సేల్స్ అయితే 58,167 యూనిట్లుగా రికార్డయ్యాయి.