- 4 శాతం అప్
- తగ్గిన టూవీలర్,త్రీవీలర్ హోల్‌సేల్స్
న్యూఢిల్లీ : ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, వ్యాన్‌లు వంటి) హోల్‌సేల్స్ ఈ ఏడాది నవంబర్‌లో 3,47,522 యూనిట్లకు పెరిగాయి. కిందటేడాది నవంబర్‌లో అమ్ముడైన 3,33,833 బండ్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి నమోదైంది. ఫెస్టివల్ డిమాండ్ నవంబర్‌లోనూ కొనసాగిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. మారుతి సుజుకీ నవంబర్‌లో 1,41,312 బండ్లను డీలర్లకు పంపగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా 48,246 బండ్లను పంపింది.
మహీంద్రా అండ్ మహీంద్రా కిందటేడాది నవంబర్‌లో 39,981 బండ్లను అమ్మగా, ఈ ఏడాది నవంబర్‌లో 46,222 బండ్లను అమ్మింది. 16 శాతం గ్రోత్ నమోదు చేసింది. టూవీలర్ హోల్‌సేల్స్ 16,23,399 యూనిట్ల నుంచి 16,01,749 కి పడ్డాయి. త్రీవీలర్ హోల్‌సేల్స్ ఈ ఏడాది నవంబర్‌లో 59,350 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఏడాది ప్రాతిపదికన ఒక శాతం తగ్గాయి.