14 శాతం పెరిగిన పీవీల అమ్మకాలు

  • జనవరిలో 3,93,074  యూనిట్ల సేల్‌

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వెహికల్స్​ హోల్‌‌సేల్స్ గత నెలలో 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వెహికల్స్​కు బలమైన డిమాండ్ ఉండడంతో జనవరిలో అత్యుత్తమ అమ్మకాలు సాధ్యమయ్యాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్​)   డేటా ప్రకారం, తయారీదారుల నుంచి డీలర్‌‌లకు ప్రయాణీకుల వెహికల్స్​ డిస్పాచ్​లు జనవరి 2023లో 3,46,080 యూనిట్లుగా ఉన్నాయి.

టూవీలర్ల​ హోల్‌‌సేల్‌‌లు గతేడాది జనవరిలో 11,84,376 యూనిట్ల నుంచి 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరుకున్నాయి. ప్యాసింజర్ వెహికల్​ విక్రయాలు నిలకడగా కొనసాగుతున్నాయి. జనవరిలో టూవీలర్ల​ విభాగం మంచి వృద్ధిని సాధించిందని సియామ్​ తెలిపింది.