ఫ్యాన్ బేరింగ్​లో ..బంగారం దాచి తెచ్చిండు

ఫ్యాన్ బేరింగ్​లో ..బంగారం దాచి తెచ్చిండు
  •     ఎయిర్​పోర్టులో ప్యాసింజర్ అరెస్ట్..
  •     636 గ్రాముల గోల్డ్ సీజ్
  •      మరో ప్యాసింజర్ నుంచి 5 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం

శంషాబాద్, వెలుగు :  ఫ్యాన్ బేరింగ్​లో బంగారాన్ని దాచి తెచ్చిన ప్యాసింజర్​ను శంషాబాద్ ఎయిర్​పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ఫ్యాన్ బేరింగ్​లో బంగారాన్ని దాచి తెచ్చాడు. స్కానింగ్​లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బేరింగ్​లో దాచిన 636 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 5 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నుంచి పట్టుబడ్డ బంగారం కిలో 218.6 గ్రాములు కాగా.. దీని విలువ సుమారు 73 లక్షల 8 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.