- కరీంనగర్, జగిత్యాల హైవే రేకుర్తి వద్ద ప్రమాదకరంగా గుంతలు
కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్- జగిత్యాల నేషనల్ హైవే కొత్తపల్లి మండలం రేకుర్తి వద్ద రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా రేకుర్తి బస్టాండ్ నుంచి బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు, కాంట్రాక్టర్ గతేడాది రోడ్డును తవ్వారు. సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించకుండా అలాగే వదిలేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు పోలీసులు గుంతల వద్ద బారికేడ్లను అడ్డుగా ఉంచారు. బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు నెలలు గడుస్తున్నా అధికారులు గుంతలను పూడ్చలేదు.
నిత్యం ఉదయం, సాయంత్రం కాలేజీలు, స్కూళ్ల వ్యాన్లతో ఈ ప్రదేశంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు ఇకనైనా స్పందించి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.