బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఒకటో ఫ్లాట్ ఫారం వైపు కొనసాగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. పనుల కారణంగా ఆ వంతెన తాత్కాలికంగా మూసివేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండో ఫ్లాట్ ఫారం వైపుకు పట్టాలు దాటాల్సి వస్తోంది.
రాఖీ పండగ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాల వారు సైతం బెల్లంపల్లి స్టేషన్‌కే వస్తుండటంతో రెండ్రోజులుగా రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. గత్యంతరం లేక ఒక ఫ్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫాంకు పట్టాల పైనుంచే దాటుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.