భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆదాయంలో కొత్తగూడెం డిపో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ సౌకర్యాల విషయంలో చాలా వెనకబడి ఉంది. బస్టాండ్‌లోకి వెళ్లాలంటే ఆచితూచి అడుగు వేయాల్సిందే. లేకపోతే గుంతల్లో పడిపోవడం ఖాయం.
చిన్నవానకే బురదమయంగా మారుతోంది. పారిశ్రామిక కేంద్రమైన పాల్వంచలోని బస్టాండ్ కూడా చిన్నవానకే నీటికుంటను తలపిస్తోంది. బస్టాండ్‌లో దాదాపు రెండు నుంచి మూడడుగులకు పైగా వరద నీరు నిల్వ ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.