సేఫ్​గా.. సాఫీగా..హైపవర్ లూప్ లో జర్నీ

సేఫ్​గా.. సాఫీగా..హైపవర్ లూప్ లో జర్నీ

ట్రైన్లు, బస్సుల్లో గంటల కొద్దీ ప్రయాణించే అవసరం ఇక లేదు. నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూప్‌‌‌‌‌‌‌‌ వ్యాక్యూమ్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్‌‌‌‌‌‌‌‌లో ఎంతో ఈజీగా, సేఫ్​గా ప్రయాణం చేయొచ్చట. ఆరేడు గంటలు పట్టే ప్రయాణం కూడా అరగంటలో పూర్తవుతుందట. స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఈవో ఎలన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేసిన రిచర్డ్‌‌‌‌‌‌‌‌ బ్రాన్‌‌‌‌‌‌‌‌సన్స్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు ‘వర్జిన్‌‌‌‌‌‌‌‌ హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూప్‌‌‌‌‌‌‌‌ పాడ్‌‌‌‌‌‌‌‌’ తయారీలో భాగమయ్యారు. వ్యాక్యూమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్‌‌‌‌‌‌‌‌ లెవిటేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌ ద్వారా గంటకు వెయ్యి కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. అంటే న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ నుంచి వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌కు కేవలం అరగంటలో వెళ్లిపోవచ్చన్నమాట. అంటే సుమారు మూడున్నర గంటల సమయం ఆదా అవుతుంది. జపాన్, చైనా, సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాలో దీని నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఇంత స్పీడ్‌‌‌‌‌‌‌‌గా ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేసే ఈ హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూప్‌‌‌‌‌‌‌‌ ప్యాడ్‌‌‌‌‌‌‌‌లో ఎలా ప్రయాణించాలో ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌కి హింట్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ వీడియోని రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిందీ వర్జిన్​ సంస్థ. ఈ ప్యాడ్‌‌‌‌‌‌‌‌ లోపలి భాగాలను చూపిస్తూ ఎలా కూర్చోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి కంఫర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటాయి వంటి అన్ని విషయాలను వీడియోలో స్పష్టంగా చూపించారు. ఒక బోగీలో 28 మంది ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌ ప్రయాణం చేయొచ్చు. హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో జర్నీ ఎంతో  సౌకర్యవంతంగా ఉండేలా చిన్న జర్క్‌‌‌‌‌‌‌‌ కూడా లేకుండా ఉండేలా చైర్స్‌‌‌‌‌‌‌‌ని డిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. జెట్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ కంటే వేగంగా వెళ్లే ఈ లూప్‌‌‌‌‌‌‌‌ పాడ్‌‌‌‌‌‌‌‌ గంటకు సుమారు పది వేల మందిని వాళ్ల గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఎంత పెద్ద భూకంపం వచ్చినా చెక్కుచెదరకుండా హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూప్‌‌‌‌‌‌‌‌ స్తంభాలు, బోగీలను నిర్మించారు. ప్రస్తుతమున్న గంటకు 150 మైళ్ల వేగంతో ప్రయాణించే మెగ్‌‌‌‌‌‌‌‌లెవ్‌‌‌‌‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌‌‌‌‌ కంటే పదింతలు వేగంగా పరుగెడుతుందీ పాడ్. హై పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ, లెవిటేషన్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌తో నిర్మించిన ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ మామూలు ఇంధన వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2020లో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోష్​ గెగల్‌‌‌‌‌‌‌‌, సారా లూచియెన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ నవాడా డిజర్ట్‌‌‌‌‌‌‌‌లో హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూప్‌‌‌‌‌‌‌‌లో ప్రయాణం చేశారు. 2023 నాటికి కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అయ్యే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.2 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు ఖర్చవుతుంది. కాగా, ఈ వర్జిన్‌‌‌‌‌‌‌‌ హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూప్‌‌‌‌‌‌‌‌ను జనాభా ఎక్కువగా ఉండే ఇండియా, సౌదీ అరేబియాలో కూడా లాంచ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే మన దేశంలో హైపర్​లూప్​ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.