దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన బాట పట్టారు. వారంలో ఒకసారి మాత్రమే నడిచే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రద్దు చేయడమే ఈ ఆందోళనకు కారణమయ్యింది.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైలును రద్దు చేయడం ఏంటని ప్రయాణికులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, అందువల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ, ప్రయాణికులు వెనక్కి తగ్గడం లేదు. తాము గమ్యస్థానాలకు ఎలా చేరాలని వారు రైల్వే సిబ్బందిని నిలదీస్తున్నారు.
కాగా, పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 39 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను దారి మళ్లించారు. మరో 7 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.
కోల్‌కతా–జమ్ము తావి ఎక్స్‌ప్రెస్
జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ (13151) అనేది కోల్‌కతా- జమ్ము తావి మధ్య నడిచే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు కోల్‌కతా నుండి జమ్మూ- కాశ్మీర్‌కు వరకూ ప్రయాణిస్తుంది. 1981 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలు ప్రయాణం దాదాపు 46 గంటలు. అంటే దాదాపు రెండు రోజులు.