సాధారణంగా బైక్ ఆగిపోతే నెట్టుకుంటే వెళ్తుంటాం. అలాగే అప్పుడప్పుడు కార్,జీపు లాంటివి ట్రబుల్ ఇస్తే... తోసుకుంటే రిపేర్ షాపుకు పోతుంటాం. కొన్ని అరుదైన సందర్భాల్లో బస్సుల్ని కూడా జనం నెట్టడం చూశాం. కానీ తాజాగా ఓ రైలును ప్రయాణికులు నెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది మీరట్ సమీపంలోని దౌరాలా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. సహరాన్‌పూర్-ఢిల్లీ రైలు ఇంజన్‌తో పాటు రెండు కంపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై ట్రైన్ నుంచి దిగేశారు. మంటలు చెలరేగిన ఇంజన్, రెండు కంపార్ట్‌మెంట్ల నుండి మిగిలిన రైలు కంపార్ట్‌మెంట్లను వేరు చేయడానికి ప్రయాణికులంతా కలిసి రైలును నెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
ఇవి కూడా చదవండి: