ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాలి : ఏసీపీ కిరణ్ కుమార్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు:  ఆటో, ఇతర వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాలని ఆటో డ్రైవర్లకు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. ‘మై ఆటో ఇస్ సేఫ్’ అనే కార్యక్రమాన్ని శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో  ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా  ఏసీపీ మాట్లాడుతూ నగరంలో 8,000 ఆటోలు, 500 క్యాబ్​లు ఉన్నాయన్నారు.  కమిషనరేట్ లో  ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం అందించడానికి మై ఆటో ఇస్​ సేఫ్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. ప్రతి  ఆటో డ్రైవర్ మై ఆటో ఇస్​ సేఫ్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో 1మేనేజర్ ఆనంద్, టు డిపో మేనేజర్ వెంకటేష్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, వన్ టౌన్ఎస్హెచ్ఓ విజయబాబు, ఎస్ఐలు సందీప్, పూర్ణేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ఆటోలకు సేఫ్టీ స్టిక్కర్​  వేయించుకోవాలి  

ధర్పల్లి: ఆటోలకుసేఫ్టీ స్టిక్కర్లు తప్పక వేయించుకోవాలని సీఐ సైదా అన్నా రు. ధర్పల్లిలో మైఆటో మై సేఫ్టీ అవేర్​నెస్​ ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. ఆటోడ్రెవర్లు తమ ఆటో ఒరిజినల్​ డాక్యుమెంట్లు చూపించి మైఆటో  మై సేఫ్టీ స్టిక్కర్లు వేయించుకోవాలని కోరారు. డ్రెవర్లకు ప్రయాణీకుల భద్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్​, ఎస్​ఐలు పాల్గొన్నారు.  

రక్షణ కోసం క్యూఆర్ కోడ్

ఆర్మూర్, వెలుగు : మై ఆటో ఇస్​ సేఫ్ లో భాగంగా  రక్షణ కోసం  ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండడంతో నేరాలు జరుగవని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు అన్నారు. ఆర్మూర్ లో శనివారం మై ఆటో ఇన్ సేఫ్ పై ఆటో డ్రైవర్లకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం కవిత,  సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శివరాం,  సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.