హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న మూడో బ్యాచ్ కి చెందిన 547 ఇన్ స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీ మూడుసార్లు జరిగాయి. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పూర్తైంది. 2023 బ్యాచ్‌కు చెందిన వీరికి 9 నెలల పాటు జరిగిన ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో టాప్ ర్యాంక్‌లో నిలిచిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు, అకాడమీ సిబ్బంది, శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ బ్యాచ్‌లో మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. వీరిలో సివిల్ ఎస్ఐలు 401 మంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ వ్యవహరించారు.